Vishwambhara Teaser : అదిరిపోయిన విశ్వంభర టీజర్.. మెగాస్టార్ ఫ్యాన్స్‌కి పండగే..

Update: 2025-08-22 08:15 GMT

మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర సినిమా యూనిట్ అదిరిపోయే కానుక అందించింది. ఒక నిమిషం 14 సెకండ్ల నిడివితో సినిమా టీజర్‌ను రిలీజ్ చేసింది ‘‘ఈ విశ్వంభర లో ఏం జరిగిందో ఈరోజు అయినా చెప్తావా" అనే చిన్న పిల్లాడి వాయిస్‌తో మొదలు అయిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇక మెగాస్టార్ లుక్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. 70 ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా మెగాస్టార్ కనపడుతున్నారు.

మెగాస్టార్ అభిమానులే కాకుండా సినీ లవర్స్ సైతం ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నాడు. బింబిసార వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మెగాస్టార్ తో కలిసి పనిచేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు డైరెక్టర్ వశిష్ఠ. సోషియో ఫాంటసీ చిత్రంగా విశ్వంభర రాబోతుంది. ఎంఎం కీరవాణి ఈ సినిమా కు మ్యూజిక్ అందిస్తూ ఉండగా...చిరంజీవి సరసన త్రిష నటిస్తున్నారు. 2026 సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News