నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని కైలాష్ దుర్గం నిర్మిస్తున్నాడు. తాజాగా తెరచాప మూవీ టీజర్ ను నటుడు కార్తీక్ రత్నం, హరికథ మూవీ దర్శకుడు మ్యాగీ చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్బంగా మ్యాగి మాట్లాడుతూ... " పృథ్వి గారికి నమస్కారం. ఈ సినిమా టీం గురించి నాకు పెద్దగా తెలీదు, కానీ వీళ్ళు పెట్టిన ఎఫోర్ట్స్ నేను టీజర్ లో చూశాను. సినిమాలో మంచి కంటెంట్ ఉంది. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది." అని అన్నారు.
నటుడు 30 ఇయర్స్ పృద్వి గారు మాట్లాడుతూ... "తెరచాప ఒక అద్భుతమైన సినిమా. నవీన్ ని చూస్తుంటే తమిళ హీరో విక్రమ్ గుర్తొస్తున్నాడు. ఆయన సినిమా కోసం ఎంత కష్టపడతాడో నవీన్ కూడా అంతే కష్టపడుతున్నాడు. కచ్చితంగా ఇతను మన టాలీవుడ్ కి విక్రమ్ లాంటి హీరో అవుతాడు. ఈ సినిమా కోసం నవీన్ రాత్రి పగలు చాలా కష్టపడ్డాడు. అతని కష్టానికి తగ్గ ప్రతిఫలం కచ్చితంగా దక్కాలని మనసారా కోరుకుంటున్నా" అన్నాడు.
డైరెక్టర్ జోయెల్ జార్జ్ మాట్లాడుతూ.. "మంచి మాస్ సినిమాగా తీసాం. ఇందులో కొంచెం తమిళ నేపథ్యం కూడా ఉంటుంది. ఇందుకు సంబంధించి రిఫరెన్స్ లు కూడా సినిమాలో మీరు చూడవచ్చు. ఈ సినిమా కోసం మా నటులు, టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు. మంచి ఔట్ పుట్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా" అని అన్నారు.
ప్రొడ్యూసర్ కైలాష్ దుర్గం మాట్లాడుతూ.." ముందుగా మా సినిమాని ఎంకరేజ్ చెయ్యడానికి వచ్చిన మీడియా వారికి, అందరికి కృతజ్ఞతలు.. నాకు ఇదే కొత్త. సినిమా రంగంలో ఇదే ఫస్ట్ టైం. ఈ సినిమా మీద నాకు నమ్మకం ఉంది. కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొడతాం" అని అన్నారు.
హీరో నవీన్ మాట్లాడుతూ.. " ఈ సినిమా గురించి మాట్లాడే ముందు కశ్మీర్ ఉగ్రదాడి గురించి మాట్లాడాలి. ఆ ఘటన నన్ను బాధించింది. చాలా కోపంగా కూడా ఉన్నాను. ఈసారి మన ఆర్మీ తీవ్రవాదులపై చేసే దాడి వాళ్ళు కలలో కూడా మర్చిపోకూడదని కోరుకుంటున్నా.. ఇక సినిమా విషయానికి వస్తే.. నాపై నమ్మకంతో ఈ సినిమా మీద 3 కోట్లు ఖర్చు పెట్టారు. చాలా మంచి ఔట్ పుట్ వచ్చింది. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది. " అన్నాడు.
నటుడు కార్తీక్ రత్నం మాట్లాడుతూ... "తెరచాప చిత్ర టీజర్ చాలా బాగుంది. నాకు లేటుగా తెలియడంతో వేరే పని ఉన్నప్పటికీ నవీన్ కోసం ఇక్కడికి వచ్చాను. నవీన్ రాజ్ కు నేను ఎంతో సపోర్ట్ గా నిలుస్తాను. దర్శకుడి మేకింగ్ అలాగే బిజిఎం, సంగీతం చాలా అద్భుతంగా ఉన్నాయి. చిత్ర బృందం అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను" అన్నారు.