Rakul Preet Singh : కాస్మో టిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటే తప్పు లేదు : రకుల్
'కెరటం' మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్ గా ఎదిగిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకుంది. లేటెస్టుగా 'మేరే హస్బెండ్ కీ బీవీ'లో కనిపించింది. ప్రస్తుతం ఈముద్దుగుమ్మ ‘ఇండియన్ 3’తో పాటు బాలీవుడ్ లో ‘దే దే ప్యార్ దే2'లో నటిస్తున్నది. ఓ వైపు మూవీస్, మరోవైపు బిజినెస్ వ్యవహారా లు చూసుకుంటూ చాలా బిజీగా గడుపు తోంది ఈ చిన్నది. కాగా.. సినీ ఇండస్త్రీలోకి వచ్చి 15 ఏండ్లు గడుస్తున్నా తన అందచందాలతో ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంది. రకుల్ ఇటీవల కాస్మోటిక్ సర్జరీపై తన అభిప్రాయాలను వెల్లడించిం ది. 'నాకు దేవుడు అందమైన ముఖాన్ని ఇచ్చాడు.. కాబట్టి నేను అలాంటి వాటి గురించి ఆలోచించలేదు. గతంలో చాలా వ్యాధులకు చికిత్స లేదు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. ఎవరైనా అందంగా కనిపించడానికి కాస్మో టిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటే అందులో తప్పు లేదు' అని పేర్కొంది.