Alia Bhatt : ఇదీ మీ ఇల్లు కాదు.. కెమెరామెన్లపై ఆలియా భట్ ఫైర్

Update: 2025-08-15 13:00 GMT

సెలెబ్రిటీల లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారు ఎక్కడికి వెళ్ళినా..ఏం చేసినా కెమెరా కన్ను వెంటాడుతూనే ఉంటుంది. వాళ్ల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఒక్కోసారి ఇది వారికి చిరాకు తెప్పిస్తుంది. తనను ఫొటోలు తీసే అత్యుత్సాహంతో ఇంటి ఆవరణలోకి వచ్చిన కెమెరా మెన్లపై అసహనానికి గురయ్యారు ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్. దయచేసి బయటకు వెళ్ళండి అంటూ సున్నితంగా తిరస్కరించారు.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆలియా భట్ ఆటవిడుపు కోసం పికిల్ బాల్ గేమ్ ఆడటానికి వెళ్ళారు. ఆమె ఇంటికి తిరిగి వచ్చిన టైంలో అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు. ఆమె ఇంటి ఆవరణలోకి ప్రవేశించి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు. దీంతో అసహనానికి గురైన ఆలియా..."లోపలికి రాకండి...ఇదేం మీ ఇల్లు కాదు. దయచేసి బయటకు వెళ్ళండి" అని కోరారు. ఇంకేం ఉంది ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో ఆది కాస్త వైరల్ గా మారింది. సెలెబ్రిటీలకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా...ఫోటోలతో డిస్ట్రబ్ చెయ్యొద్దు అని ఒకరు కామెంట్ చెయ్యగా...అనుమతి లేనిదే ఫోటోలు తీసే అధికారం ఎవ్వరికి లేదంటూ ఇంకొకరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అయితే ఆలియా భట్ ను సపోర్ట్ చేస్తూ ఎక్కువ మంది కామెంట్స్ చేయడం విశేషం...

Tags:    

Similar News