Tiger Nageshwar Rao : యూట్యూబ్‌లో అదరగొడుతోన్న టైగర్ నాగేశ్వరరావు

Update: 2024-04-22 09:25 GMT

వంశీ డైరెక్షన్‌లో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీ హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో అదరగొడుతోంది. 2 నెలల్లోనే 100 మిలియన్ల వ్యూస్, 1 మిలియన్ లైక్స్ సొంతం చేసుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు.తమ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్‌ పెట్టారు. స్టువర్టుపురం గజ దొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

గత ఏడాది అక్టోబర్‌లో రిలీజవగా, మిశ్రమ స్పందన వచ్చింది. ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణూ దేశాయ్ కీలక పాత్రల్లో నటించారు. స్టూవర్టుపురం గజ దొంగగా పేరు పొందిన నాగేశ్వరరావు కాలం నాటి వాస్తవ సంఘటనలు, వార్తలు ఆధారం చేసుకుని దీనిని తీర్చిదిద్దారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్‌ అగర్వాల్‌ దీనిని నిర్మించారు.

ఎన్నో అంచనాల మధ్య గతేడాది అక్టోబర్‌లో పాన్‌ ఇండియా మూవీగా విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. పోటిలో లియో, భగవంత్ కేసరి లాంటి సినిమాల వలన మూడో ఆప్షన్ గా మారిన టైగర్ నాగేశ్వరరావు మొత్తం మీద రన్ అయిపోయే టైంకి 38.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 25.50 కోట్లు మాత్రమే రికవరీ చేసి 13 కోట్ల రేంజ్ లో లాస్ తో ఫ్లాఫ్ గా నిలిచింది.

కాగా రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మిస్టర్‌ బచ్చన్ సినిమాలో నటిస్తున్నాడు. భాగ్య శ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.

Tags:    

Similar News