Tollywood Meeting : సినీ ప్రముఖుల కీలక భేటీ..!

Tollywood Meeting : తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది.;

Update: 2022-02-20 08:30 GMT

Tollywood Meeting : తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమావేశానికి హీరో రాజేంద్రప్రసాద్, రాజమౌళి, కొరటాల శివ, మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్, స్రవంతి రవికిషోర్, చదలవాడ శ్రీనివాసరావు, అశోక్‌ కుమార్‌ హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్ ఎన్నికల నిర్వహణపై క్లారిటీ, టాలీవుడ్‌లోని ఇతర సమస్యలపై చర్చిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్‌ ప్రముఖులు జరిపిన చర్చలపైనా ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి అండగా ఉంటున్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు టాలీవుడ్ తరపున ధన్యవాదాలు తెలిపే అంశంపైనా చర్చ జరుగుతోంది. అలాగే, జగన్‌తో మీటింగ్‌కు సినీ ప్రముఖులతో పాటు మోహన్‌బాబుకు కూడా ఆహ్వానం వెళ్లడం, ఆ ఇన్విటేషన్ మోహన్‌బాబు వరకు వెళ్లలేదని మంచు విష్ణు చెప్పడంపైనా ఈ మీటింగ్‌లో ప్రత్యేకంగా చర్చిస్తున్నారు.

Tags:    

Similar News