టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. యంగ్ ప్రొడ్యూసర్ కేదార్ శెలగంశెట్టి హఠాత్తుగా కన్నుమూశారు. ఈయనకు అల్లు అర్జున్, బన్నీ వాసులకు అత్యంత సన్నిహితుడుగా పేరుంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన గం గం గణేశా అనే చిత్రాన్ని నిర్మించింది కేదారే. అలాగే గెటప్ శీను హీరోగా రూపొందిన రాజు యాదవ్ చిత్ర నిర్మాత్లో ఒకరు. విజయ్ దేవరకొండతో ఓ భారీ సినిమా నిర్మించేందుకు దర్శకుడు సుకుమార్ తో ఒప్పందం కూడా చేసుకున్నాడు. మరి ఏమైందో కానీ ఆయన దుబాయ్ లో కన్నుమూశారు. ఆయన మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.
ఓ చిన్న సినిమాతో మొదలుపెట్టినా.. విజయ్, సుకుమార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కి ఉంటే నిత్యం వార్తల్లో ఉండేవాడే. చాలా తక్కువ వయసులోనే కన్నుమూయడం విషాదం. మరి ఆయన మరణానికి కారణాలేంటో త్వరలోనే తెలుస్తుంది.