Udayabhanu : చాలా గ్యాప్ తరువాత తెరపైకి

Update: 2024-11-10 16:00 GMT

ఘటోత్కచుడి కుమారుడు బార్బరికుడు పాత్ర ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. మోహన్‌ శ్రీవత్స దర్శకుడు. విజయ్‌పాల్‌ రెడ్డి అదిధాల నిర్మాత. శుక్రవారం ఈ సినిమా నుంచి ఉదయభాను పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.ఈ సినిమాలో ఆమె వాకిలి పద్మ అనే పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని చిత్రబృందం తెలిపారు. చాలా కాలం విరామం తర్వాత ఉదయభానుకు మంచి పాత్ర దక్కిందని, షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలల్లో బిజీగా ఉందని, త్వరలో రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు.

Tags:    

Similar News