Allu Arjun-Trivikram : అల్లు అర్జున్ కోసం స్పీడు పెంచిన త్రివిక్రమ్!

Update: 2024-10-08 10:02 GMT

మహేష్ బాబు తో 'గుంటూరు కారం' తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమాకోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ కలయికలో సినిమాకి సంబంధించి అనౌన్స్ మెంట్ వచ్చింది. ‘జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో‘ తర్వాత వీరి కలయికలో రూపొందబోయే నాల్గవ చిత్రమిది.

గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించే బన్నీ-త్రివిక్రమ్ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయట. ఈ చిత్రాన్ని సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడట త్రివిక్రమ్. ఇప్పటికే దాదాపు స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసిన త్రివిక్రమ్.. త్వరలో లొకేషన్స్ హంటింగ్, సాంగ్స్ రికార్డింగ్ వంటివి మొదలు పెట్టనున్నాడట.

అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2‘ డిసెంబర్ 6న విడుదలకానుంది. ‘పుష్ప 2‘ విడుదలైన తర్వాత ఒక నెల రోజుల పాటు రెస్ట్ తీసుకుని.. త్రివిక్రమ్ సినిమాతో బిజీ అవుతాడట బన్నీ. 2025 ప్రథమార్థంలో అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కనున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.

Tags:    

Similar News