Unstoppable With NBK 2: ఒరే చరణ్ నువ్వు ఫ్రెండ్‌వా లేక ఎనిమీవా: ప్రభాస్
Unstoppable With NBK 2: డిసెంబర్ 30వ తేదీన ప్రభాస్ ప్రత్యేక అతిథిగా రావడంతో నందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె 2' టాక్ షోకు భారీ ఊపు వచ్చింది.;
Unstoppable With NBK 2: డిసెంబర్ 30వ తేదీన ప్రభాస్ ప్రత్యేక అతిథిగా రావడంతో నందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె 2' టాక్ షోకు భారీ ఊపు వచ్చింది. బాహుబలి స్టార్ వస్తున్న స్పెషల్ ఎపిసోడ్ కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సరిగ్గా 12 అయ్యిందో లేదో ఎపిసోడ్ యొక్క మొదటి భాగం స్ట్రీమ్ అయింది. ఒకానొక సందర్భంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ప్రభాస్ ఫోన్ చేసి హోస్ట్ నందమూరి బాలకృష్ణతో సరదాగా సంభాషించారు.
ప్రభాస్ ప్రస్తుత గర్ల్‌ఫ్రెండ్ పేరు వెల్లడించాలని బాలకృష్ణ రామ్ చరణ్‌ను అడిగారు. మీరు రెడ్డి, నాయుడు, రాజు, చౌదరి లేదా సనన్ లేదా శెట్టితో డేటింగ్ చేస్తున్నారా అని బాలకృష్ణ ప్రభాస్‌ను అడిగారు. ఇదే విషయమై రామ్ చరణ్ మాట్లాడుతూ, త్వరలోనే ప్రభాస్ అందరికీ శుభవార్తతో వస్తాడని వెల్లడించారు. ఇది విన్న ప్రభాస్, రామ్ చరణ్‌ను తిట్టి, "ఒరేయ్ చరణ్ నువ్వు ఫ్రెండా లేక ఎనిమీనా అని అంటాడు.
ఇలాంటి సరదా సంభాషణతో ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇంతకీ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అని ఫ్యాన్ వెయిట్ చేస్తున్నారు. బాలయ్యతో ప్రభాస్ ఎపిసోడ్ రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ఇప్పటికే విడుదలైంది. ఇక రెండవ భాగం జనవరి 6న విడుదల కానుంది. ఈ ఎపిసోడ్‌లో, ప్రభాస్, గోపీచంద్ సంవత్సరాల తరబడి వారి స్నేహం ఎలా వికసించిందో పంచుకోనున్నారు.