Upendra : ప్రేక్షకులకు ఉపేంద్ర వార్నింగ్

Update: 2024-12-02 10:13 GMT

మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో ఎక్స్ పర్మెంట్స్ చేశాడు ఉపేంద్ర. ఆక్రేజ్ తో తనే హీరోగా మారాడు. హీరో అయిన తర్వాత కూడా దర్శకుడుగా విజయాలు అందుకున్నాడు. తెలుగులో ఎలా అయితే రామ్ గోపాల్ వర్మ శివను పాథ్ బ్రేకింగ్ మూవీ అని చెప్పుకుంటామో.. కన్నడలో ఉపేంద్ర రూపొందించిన ‘ఓమ్’ను అలా చెబుతారు. ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యధిక సార్లు రీ రిలీజ్ అయిన సినిమా కూడా ఓమ్ నే. అయితే కొన్నేళ్లుగా ఉపేంద్ర దర్శకత్వానికి దూరంగా ఉంటున్నాడు. అభిమానుల కోరిక మేరకు ఆ మధ్య ‘యూఐ ద మూవీ’ అనే సినిమా స్టార్ట్ చేశాడు.

లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ .. ట్రైలర్ కాదు.. దీనికి వార్నర్ అని పేరు పెట్టాడు ఉపేంద్ర. ఆ వార్నర్ ను విడుదల చేశాడు. చూస్తే ఇది 2040లో సాగే కథగా చెప్పబోతున్నట్టు కనిపిస్తోంది. ఆ కాలంలో కూడా కులం, మతం, వర్గం, పేద, సంపన్నులు అంటూ అన్ని విభజనలూ కంటిన్యూ అవుతున్నాయనే భావనతో కనిపిస్తుందీ వార్నర్. పైగా ఏ జాతి వాళ్లు ఆ జాతికి సంబంధించిన సింబల్ ను పిరుదులపై వేయించుకోవాలనే రూల్ కూడా ఉంటుందట ఆ కాలంలో. వాళ్లంతా అత్యంత పేదరికంతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ.. తిండికీ, బట్టకూ దూరంగా కనిపిస్తుంటారు. బట్.. అంత దరిద్రంలో కూడా ప్రభుత్వం ఉచితంగా అందించిన ‘సెల్ ఫోన్స్’ చూస్తూ క్రికెట్ గురించి కామెంట్స్, మనోళ్లుమంగళ గ్రహంపైకి వెలుతున్నారని ఆనందం, మనవాళ్లు వెపన్స్ కొన్నారు కాబట్టి మనం సేఫ్ గా ఉన్నామని భావిస్తూ అదే దరిద్రంలో బ్రతికేస్తుంటారు వీళ్లు.

వీరికి దూరంగా ఆ ప్రాంతానికి కింగ్(ఉపేంద్ర)లాంటి వాడు ఆ మురికి వాడకు వస్తే.. ధిక్కారం ధిక్కారం అని నినాదాలు చేస్తుంటారు. దీంతో ఈ ధిక్కారాల కన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ.. అంటూ తన వద్ద ఉన్న గన్ తో అందరినీ కాల్చేస్తాడు.

ఇదీ ఉపేంద్ర ‘యూఐ’ ఫస్ట్ వార్నర్ మీనింగ్. తరచి చూస్తే ఈ దరిద్రులంతా అధికారంలోకి వస్తే తప్ప వారి జీవితం మారదు అనే సందేశం కూడా కనిపిస్తోంది. అది వదిలేసి ప్రపంచంలోని పనికి మాలిన విషయాలను గురించి మాట్లాడుకుంటూ.. ఉచితాలను అనుభవిస్తున్నంత కాలం వాళ్ల బ్రతుకులు మారవు అనే స్ట్రాంగ్ పాయింట్ కూడా చెప్పబోతున్నాడేమో అనిపిస్తోంది.

మొత్తంగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇక ఉపేంద్రతో పాటు రీష్మ నానయ్య, సన్నిలియోన్, జిషుసేన్ గుప్తా, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఇంత గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టిన ఉపేంద్రకు ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో కానీ.. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారీ చిత్రాన్ని. 

Tags:    

Similar News