తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఆంజనేయ స్వామిని మెగా హీరో వరుణ్ తేజ్ దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయ ప్రకారం వరుణ్ తేజ్‌కు అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు వరుణ్ తేజ్. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. ఆలయ సిబ్బంది వరుణ్ తేజ్ కి స్వామి వారి శేష వస్త్రం, తీర్థప్రసాదాలతోపాటు స్వామివారి చిత్రపటం అందజేశారు. మెగా ఇంటి ఇలవేల్పు కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు వరుణ్ తేజ్. మహిమగల దేవుడని, మొదటిసారి కొండగట్టుకు వచ్చానని మంచి దర్శనం అయ్యిందని తెలిపారు. మొదటిసారి హనుమాన్ దీక్ష తీసుకున్నట్లు తెలిపారు. వరుణ్ తేజ్ వచ్చాడని తెలియడంతో జనం గుమికూడారు.