Producer Arrest : వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్..

Update: 2025-08-21 05:35 GMT

‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసులో విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను విజయవాడకు తరలించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నివసించే దాసరి కిరణ్ బంధువు గాజుల మహేష్ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నారు. దాదాపు రెండేళ్ల క్రితం కిరణ్ మహేష్ నుంచి రూ.4.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అయితే ఎంత అడిగినా డబ్బు తిరిగి ఇవ్వకుండా ఆయన జాప్యం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 18న మహేష్ తన భార్యతో కలిసి విజయవాడలో ఉన్న కిరణ్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కిరణ్ అనుచరులు సుమారు 15 మంది మహేష్ దంపతులపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మహేష్ విజయవాడలోని పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దాసరి కిరణ్‌ను అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News