Adhurs : ఎన్టీఆర్ అదుర్స్ నా బయోపిక్... వేణు స్వామి మరో సంచలనం

Update: 2024-04-29 07:56 GMT

ఎన్టీఆర్-బ్రహ్మానందం-వినాయక్-దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన అదుర్స్ మూవీ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. జనానికి ఎవర్ గ్రీన్ వినోదం అందిస్తూ ఈ మూవీ సీన్లు ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంటుంటాయి. ఐతే... ఈ మూవీ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి స్పందన వైరల్ అవుతోంది.

కొంతకాలంగా సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలను, రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నాడు వేణుస్వామి. ఎన్టీఆర్ సినిమాల్లో ఒక సూపర్ హిట్ సినిమా తన బయోపిక్‌గా తెరకెక్కిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

వినాయక్‌ అదుర్స్ సినిమాని తన బయోపిక్ గా తీశారని వేణుస్వామి వివరించాడు. చారి, నరసింహా ఆ రెండు పాత్రలు తనవేనని చెప్పుకొచ్చాడు. సినిమా పూజా కార్యక్రమాలను తానే చేశాననీ..ఎన్టీఆర్ కొబ్బరికాయ కొడితే పువ్వు వచ్చిందని.. అప్పుడే ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పిన మాట గుర్తుచేసాడు.

Tags:    

Similar News