Goundamani : సీనియర్ నటుడికి భార్యా వియోగం

Update: 2025-05-06 08:30 GMT

తమిళ్ సీనియర్ నటుడు గౌండమణి భార్య శాంతి(67) చనిపోయారు. రెండు రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. గౌండమణి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హాస్య నటుడుగా తనదైన ముద్రను వేశాడు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతుండేవి. తెలుగులో కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ చేసిన ఎన్నో పాత్రలు ముందుగా తమిళ్ లో గౌండమణి, సెంథిల్ చేసినవే. ఈ వయసులో కూడా ఆయన ఇంకా ఉత్సాహంగానే ఉన్నారు. ఈ యేడాది ఓ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు కూడా.

హెల్త్ పరంగా గౌండమణి భార్య శాంతి దీర్ఘకాలిక వ్యాధులతో ఏం ఇబ్బంది పడటం లేదు. కాకపోతే రెండు రోజుల్లోనే సడెన్ గా మరణించడం ఎవరూ ఊహించలేదని చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే కోలీవుడ్ లోని స్టార్ హీరోలతో పాటు గౌండమణి అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన ఇంటికి వెళ్లి ఓదార్చారు.

Tags:    

Similar News