హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'తుఫాన్'. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి. లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య, సినిమాలను నిర్మించింది.
పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో 'తుఫాన్' సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. 'తుఫాన్' సినిమాను ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు మేకర్స్ గురువారం ప్రకటించారు. తుఫాన్ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసింది.