Vijay Antony : ఈ మూవీ హాలీవుడ్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది : విజయ్ ఆంటోనీ
Vijay Antony : మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘హత్య’ మూవీతో మనముందుకు వస్తున్నాడు విజయ్ ఆంటోనీ;
Vijay Antony : మరో సస్పెన్స్ థ్రిల్లర్ 'హత్య' మూవీతో మనముందుకు వస్తున్నాడు విజయ్ ఆంటోనీ. కథ మొత్తం మోడల్ లైలా మర్డర్ మిస్ట్రీ చుట్టే తిరుగుతుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా.. రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. బాలాజీ కుమార్ దీనికి దర్శకత్వం వహించారు. విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. హత్య సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించినట్లు చెప్పారు. హాలీవుడ్ మూవీ చూసిన ఎక్స్‌పీరియన్స్ కలుగుతుందన్నారు. కోలీవుడ్ నుంచి వచ్చినా తెలుగు ప్రేక్షకులు తనను ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.