Vijay Deverakonda : రష్మికకు విజయ్ దేవరకొండ సాయం

Update: 2024-12-05 13:45 GMT

ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుష్ప 2 మూవీ మానియాతో బిజీబిజీగా గడుపుతోంది. అలాగే టాలీవుడ్, బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. ఆమె చెస్తున్న మూవీస్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుండటంతో ఈ బ్యూటీకి కలిసివస్తోంది. పుష్ప 2 మూవీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఓ వైపు లేడీ ఓరియెంట్ మూవీస్.. మరోవైపు కమర్షియల్ మూవీస్ తో దూసుకుపోతోంది. తాజాగా పుష్ప 2 ప్రీరిలీజ్ ఈవెంట్ లో రష్మిక నెక్స్ట్ మూవీ గర్ల్ ఫ్రెండ్పై డైరెక్టర్ సుకుమార్ సెన్సేషన్ కామెంట్స్ చేశారు. అందులో రష్మిక పర్ఫామెన్స్ బాగుందని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక ఈసినిమా టీజర్లో రష్మిక క్యారెక్టర్ ను పరిచయం చేయడం, ఆ పాత్రను వివరించడం లాంటి సీన్లకు విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో గర్ల్ ఫ్రెండ్ టీజర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News