Vijay Deverakonda : ప్రేమ వ్యవహారంపై విజయ్ దేవరకొండ ఇంట్రస్టింగ్ రిప్లై
టాలీవుడ్ నటుడు విజయ్ డేటింగ్ లైఫ్ గురించి వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన ఒక నటితో ప్రేమలో ఉన్నారని కూడా ప్రచారంలో ఉంది. దీనిపై ఆయన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. సరైన సమయంలో పర్సనల్ విషయాలు చెబుతానంటున్నారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆయన మాట్లాడారు. “నాగురించి, నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని చాలా మందిలో ఉంటుంది. ఈ ఆసక్తి సహజమైనదే. సెలబ్రిటీగా ఉండడం వల్ల చాలా వార్తలు వస్తుంటాయి. వాటిని సాధారణం వార్తలుగానే భావిస్తాను. తగిన సందర్భంగా వచ్చినప్పుడు, సరైన కారణాలతో స్పందిస్తాను" అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కొత్త చిత్రం బిజీలో ఉన్నారు. వరుసగా మూడు సినిమాలు అంగీకరించారు.