Vijay Deverakonda : విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రకటన

Update: 2024-05-09 05:55 GMT

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఆయన నటించనున్న కొత్త సినిమాను మేకర్స్ ప్రకటించారు. దిల్ రాజు నిర్మించనున్న SVC59 సినిమాలో విజయ్ హీరోగా నటించనున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో ‘కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే’ అనే ట్యాగ్‌లైన్‌ ఉంది. మొత్తం ఐదు భాషల్లో పాన్ ఇండియాలో రిలీజ్ కానున్న ఈ సినిమాను రవి కిరణ్ కోలా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై పీరియాడిక్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు.

ఇక ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో విజయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ ఈ సినిమాకు విడుదల అయిన మొదటి షో నుంచే నెగటివ్ టాక్ వచ్చింది.దీనితో నెగటివ్ టాక్ ఎఫెక్ట్ ఈ సినిమా కలెక్షన్స్ పై పడటంతో ఈసినిమా కమర్షియల్ గా విజయం సాధించలేదు.అయితే రీసెంట్ గా ఓటిటిలోకి వచ్చిన ఈ మూవీ అదిరిపోయే వ్యూస్ తో దూసుకుపోతుంది.

అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆతర్వాత వరుసగా ఫ్లాప్స్ అందుకుంటు న్నాడు. మొన్నామధ్య వచ్చిన ఖుషి సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోయినా.. కలెక్షన్స్ ఓ మాదిరిగా రాబట్టిం ది. కానీ ఫ్యామిలీ స్టార్ సినిమా విజయ్ ఫ్యాన్సును నిరాశపరిచింది. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేస్తున్నా డు విజయ్.

 

Tags:    

Similar News