Samantha Post Viral : నువ్వు గెలవాలని కోరుకుంటున్నా.. సమంత పోస్ట్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇన్ స్టాగ్రామ్ లో ఓ షాకింగ్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతున్న ఈ పోస్ట్ లో నువ్వు గెలవాలని నేను కోరుకుంటున్నాను అని ఉంది. దాంతోపాటు నీ హృదయం ఏదైతే కోరుకుంటుందో.. నువ్వు ఏ ఆశలు కలిగి ఉన్నావో.. నేను నీ కోసం ప్రార్థిస్తున్నాను.. మీరు విజయానికి అర్హులు అంటూ ఆ పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఐపీఎల్ లో నిన్న రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరగడంతో బెంగళూరు జట్టును ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందనే కామెంట్స్ నెటిజన్స్ వస్తున్నాయి. ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. గతంలో కూడా విరాట్ కోహ్లికి సమంత మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో నిజంగానే కోహ్లికి మద్దతుగా సమతం పోస్ట్ చేసిందని కొందరు అంటున్నారు. మరి కొందరు మాత్రం ఆమె పెట్టిన పోస్ట్ కు, క్రికెట్ కు సంబంధం లేదని.. ఏదో పర్సనల్ పోస్ట్ లాగా ఉందని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ విషయంపై సమంత క్లారిటీ ఇస్తే తప్ప.. క్లారిటీ రాదు. ఇక సినిమాల విషయానికొస్తే.. రాజ్ & డీకే వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ'లో వరుణ్ ధావన్ తో కలిసి సమంత నటించింది. త్వరలో ఈ మూవీ విడుదల కానుంది.