virata parvam : థియేటర్లోనే విరాట పర్వం.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
virata parvam : కరోనా మహమ్మారి కారణంగా ధియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే... దీనితో చాలా సినిమాలు విడుదల వాయిదా పడ్డాయి.;
virata parvam : కరోనా మహమ్మారి కారణంగా ధియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే... దీనితో చాలా సినిమాలు విడుదల వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో చాలా సినిమాలు ఒటీటీలో రిలీజ్ అవ్వనున్నాయి. అందులో భాగంగానే వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'విరాట పర్వం' కూడా ఒటీటీలోనే రిలీజ్ అవ్వనుంది అనే ప్రచారం సాగుతుంది. అయితే దీనిపైన చిత్రబృందం స్పందించింది. సినిమాని థియేటర్ లోనే విడుదల చేస్తామని యూనిట్ ప్రకటించింది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో నక్సలైట్ల జీవన విధానం, వారి ఆశయ సాధనలో వాళ్లు ఎదుర్కున్న ఇబ్బందులను గురించి వివరించనున్నారు. ప్రియమణి కీలక పాత్రలో నటిస్తుంది. సినిమా పైన భారీ అంచనాలన్నాయి.