Kannappa : కన్నప్పను ఏమన్నా అన్నారో.. మంచు విష్ణు మాస్ వార్నింగ్

Update: 2025-03-24 05:30 GMT

విష్ణు మంచు టైటిల్ పాత్రలో నటించిన సినిమా కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ కేమియో రోల్స్ లో నటిస్తున్నారు. విష్ణు సొంత బ్యానర్ లో రూపొందుతోన్న ఈ మూవీపై అంచనాలు పెంచడంలో సక్సెస్ అవుతున్నాడు విష్ణు. అయితే మామూలుగా మంచు ఫ్యామిలీ అంటే కొందరు సోషల్ మీడియాలో రెచ్చిపోవడం, ట్రోల్ చేయడం చూస్తున్నాం కదా. అలాగే కన్నప్ప కంటెంట్ ను కూడా కొందరు ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ మధ్య వచ్చిన రొమాంటిక్ సాంగ్ ను విమర్శిస్తున్నారు. ఇలాంటి వారందరినీ ఓ మాస్ వార్నింగ్ ఇచ్చాడు విష్ణు.

తమ సినిమాను ఏమన్నా అంటే.. ఆ శివుడు వారిని తీవ్రంగా శిక్షిస్తాడని చెప్పారు. వారంతా శివుడి శాపానికి గురవుతారు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇది చూసిన తర్వాత కూడా ఇంకా ఈ సినిమాను విమర్శిస్తారు అనుకోలేం. కాకపోతే శ్రీ కాళహస్తి ప్రాంతంలోని తిన్నడు అనే ఓ బోయవాడికి అడవిలో శివలింగం కనిపించడం తర్వాత తను భక్తుడుగా మారి కన్నప్పగా నామాంతరం చెందడం అనే కోణంలో నిజంగా జరిగిన కథే అనే భావనతో ఉన్న ప్రేక్షకులకు, భక్తులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. కాకపోతే అతన వేరే దేశపు అడవుల్లో చిత్రీకరించడమే చాలామందికి నచ్చలేదు. ఏదేమైనా తనను, తన సినిమాను ట్రోల్ చేస్తున్నవారిపై కొన్నాళ్లుగా మంచు విష్ణు ఉక్కుపాదం మోపుతున్నాడు అనే చెప్పాలి.

Tags:    

Similar News