మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తను నటించే 13వ చిత్రాన్ని ప్రకటించారు. 'దసరా' సినిమాతో భారీ విజయం అందించిన నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.
నూతన దర్శకుడు శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే యూనిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా. విశ్వక్ పవర్ ఫుల్ ఐపిఎస్ ఆఫీసర్ గా ప్రి-లుక్ పోస్టర్ మేకర్స్ విడుదల చేశారు. ఫైర్ బ్యాక్ డ్రాప్ లో చేసిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తి కలిగిస్తోంది. 'ఎవ్రీయాక్షన్ ఫైర్స్ రియాక్షన్' అనేది ఈ సినిమా ఉప శీర్షిక.
ఈ చిత్రానికి 'తంగలాన్' ఫేమ్ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీని నిర్వహించనుండగా, కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం సమకూర్చనున్నారు.