Triptii Dimri : స్పిరిట్ కోసం ఎదురుచూస్తున్నా : త్రిప్తి డిమ్రి

Update: 2025-07-17 11:45 GMT

సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' సినిమాలో నటించి తెలుగులోనూ మంచి గుర్తింపు పొందిన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి.. ఇప్పుడదే దర్శకుడు ప్రభాస్ తో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’లో హీరోయిన్ చాన్స్ దక్కించుకొని ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన ‘ధడక్ 2’ ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ.. లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'విభిన్నమైన కథల్లో నటించినప్పుడే నటిగా ఎదుగుదల ఉంటుంది. ఇండస్ట్రీలోని టాలెంటెడ్ డైరెక్టర్ల మూవీల్లో చాన్స్ రావడం పెద్ద గిఫ్ట్. వేర్వేరు వ్యక్తులతో పని చేయడం మంచి అనుభవం. వారి నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. అవి కెరీర్ కు ఎంతో ఉపయోగపడతాయి. నేను ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాను. ఈ ఏడాదిలోనే అది విడుదల కానుంది. దానితో పాటు 'స్పిరిట్'లో చేస్తున్న. దీన్ని సందీప్ వంగా గొప్పగా తెరకెక్కిస్తున్నా రు. ఈ మూవీ విడుదల కోసం ఉత్సాహంగా ఉన్నాను. 'స్పిరిట్' ఓ అందమైన చిత్రం' అంటూ త్రిప్తి చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News