Suriya's Retro : సూర్య రెట్రో లెక్కలు ఎక్కడ తప్పాయి..

Update: 2025-05-02 11:08 GMT

తమిళ్ స్టార్ హీరో సూర్య బ్యాడ్ లక్ కంటిన్యూ అవుతోందా.. అంటే అవుననే అంటున్నారు. తెలుగులోనే కాదు.. తమిళ్ లో కూడా అతని లేటెస్ట్ మూవీ రెట్రోకు అంత గొప్ప రెస్పాన్స్ ఏం రాలేదు. వరుసగా చాలా సినిమాలు పోతున్నా.. సూర్యకు ఓపెనింగ్స్ తగ్గలేదు. కానీ అతను మాత్రం కొన్నేళ్లుగా అభిమానులతో పాటు బాక్సాఫీస్ ను డిజప్పాయింట్ చేస్తూనే ఉన్నాడు. కంగువా తర్వాత భారీ అంచనాలు పెట్టుకున్న మూవీ రెట్రోతో వచ్చాడు. ట్రైలర్ పెద్దగా అర్థం కాలేదు. కానీ కార్తీక్ సుబ్బురాజ్ డైరెక్షన్ ఇలాగే ఉంటుంది. సినిమాతో ఆకట్టుకుంటాడు అనుకున్నారు. బట్ అదీ అవలేదీ సారి.

రెట్రో టేకింగ్ పరంగానూ మేకింగ్ పరంగానూ కార్తీక్ సుబ్బురాజ్ పెద్దగా మెప్పించలేదు. ఇక కథ, కథనాలైతే మరీ అవుట్ డేటెడ్ గా ఉన్నాయనే చెప్పాలి. అదే సినిమాకు నెగెటివ్ రివ్యూస్ రావడానికి కారణమైంది.

ఓ అనాథ పిల్లాడు.. అతన్ని చేరదీసిన ఓ జంట. రౌడీయిజం, గూండాయిజం నేపథ్యం ఉన్న ఫ్యామిలీ ఇది. పిల్లాడంటే పెంపుడు తండ్రికి ఇష్టం లేకపోయినా తల్లి ప్రేమకు బానిస అయ్యి పెరిగే పిల్లాడు. తనను పెంచిన వ్యక్తిలాగానే చిన్నతనం నుంచే ఓ రౌడీగా పెరుగుతాడు. ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత.. ఆమె కోసం అన్నీ వదిలేసి కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకుంటాడు. కానీ తండ్రి అతని వద్ద ఉన్న సీక్రెట్ కోసం పెళ్లి రోజే గొడవపెట్టుకుంటాడు. తను తాళి కట్టిన అమ్మాయిని చంపేయబోతోంటే ఆవేశంలో అతని చెయ్యే నరుకుతాడు కొడుకు. కట్ చేస్తే మళ్లీ హింస మొదలుపెట్టావంటూ అతని జీవితం నుంచే వెళ్లిపోతుంది హీరోయిన్. హీరో జైలు పాలవుతాడు. అక్కడి నుంచే హీరోయిన్ ఎక్కడికి వెళ్లిందో తెలుసుకుని.. తనకు తెలిసిన మార్షల్ ఆర్ట్స్ ద్వారా బయటకు వచ్చి.. హీరోయిన్ ను కలుసుకుంటాడు. ఈ క్రమంలో తను పుట్టిన ఊరు, సొంత తల్లితండ్రులను తెలుసుకోవడం.. తనకు తెలియకుండా తనే వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం.. నిజం తెలిసిన తర్వాత వారి కోసం పోరాటం.. ఇదీ కథ.

చాలా లేయర్స్ ఉన్న స్టోరీ ఇది. ఇలాంటి కథల్లో స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేయాలి. రెట్రోలో అది పూర్తిగా మిస్ అయింది. సీన్స్ కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా జంప్ అవుతుంటాయి.

ఇటు ప్రెజెన్స్, నటన బావున్నాయి. కానీ కథలో దమ్ము లేనప్పుడు, కథనంలో పస లేనప్పుడు ఇవి పనిచేయవు అనేది ఎన్నో సినిమాలు నిరూపించాయి. పూజాహెగ్డే డీ గ్లామర్ రోల్ చేసింది. తన నటనలో ఏ ఎక్స్ ప్రెషన్స్ కనిపించవు. సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో సినిమా అంతా నడిపించేసింది. మిగతా పాత్రల్లో జోజూ జార్జ్ విలన్ గా మెప్పించాడు. అయినా అతను బలమైన విలన్ కాదు. ఇదో మైనస్ అయితే.. ప్రీ క్లైమాక్స్ నుంచి కథ యుగానికి ఒక్కడు తరహాలో తరాల పాటు వెనక్కి వెళ్లినంత ఫీలింగ్ తెప్పించాడు. పైగా బాణాలతో యుద్ధం సీన్స్. ఇవన్నీ సిల్లీగా అనిపించాయి. ఒక సీక్వెన్స్ కు మరో సీక్వెన్స్ కు సరైన కనెక్షన్ సెట్ చేయడంలో దర్శకుడి వైఫల్యం పూర్తిగా కనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే గ్లాడియేటర్ తరహా యాక్షన్ సీక్వెన్స్ లో వాళ్లు పట్టుకున్న ఆయుధాలైతే థర్మకోల్ తో సహా కనిపిస్తుంటాయి. అంత సిల్లీగా ఉంటుంది. మొత్తంగా ఇది సూర్యకు మరో బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ నే ఇస్తుందని చెబుతున్నారు. అటు వసూళ్లు కూడా అంతంత మాత్రంగానే ఉండటం చూస్తుంటే అతని ఖాతాలో మరో ఫ్లాప్ చేరినట్టే అంటున్నారు.

Tags:    

Similar News