ప్రముఖ కోలీవుడ్ హీరో విశాల్ మరోసారి అస్వస్థ తకు గురైన విషయం తెలిసిందే. తమిళనాడు విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి విశాల్ ప్రత్యేక అతిథిగా వెళ్లాడు. ఈ క్రమంలో వేదికపై ఉండగా ఒక్కసారిగా ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. అసలు విశాల్ కి ఏమైంది ? అంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఆయన హెల్త్ పై తాజాగా పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. 'విశాల్ నిన్న మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వల్లే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తు తం ఆయన పూర్తి ఆరోగ్యం గానే ఉన్నారు. సమయానికి ఆహారం తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. అభిమానులు ఎవరూ ఆందోళ చెందా ల్సిన అవసరం లేదు. మొత్తానికి ఆయన హెల్త్ బాగానే ఉంది అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చు కున్నారు. కాగా.. గతంలోనూ విశాల్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ‘మద గజ రాజా’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో విశాల్ గజగజ వణికిపోతూ, మైక్ కూడా పట్టుకోలేక ఇబ్బంది పడుతూ కనిపించిన వీడియో అప్పట్లో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. విశాల్ చాలా బలహీనంగా కనిపించడం, అనారోగ్యంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎలా ఉండే విశాల్, ఎలా అయిపోయాడంటూ అతని అభిమానులతో పాటు సినీ జనం కూడా చర్చించుకున్నారు.