Samantha : అప్పటి సమంత ఏమయ్యారు.. ప్రశ్నించిన రానా

Update: 2024-11-07 04:57 GMT

ఏ మాయ చేసావే సినిమాతో జెస్సీగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సమంత. తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం కూడా సమంతకు దక్కింది. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసింది. ఇక సమంత చేసిన ఫ్యామిలీ మెన్ సిరీస్ ఎంత పెద్దగా పాపులర్ అయిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సమంత కామెడీ టైమింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నోసార్లు తన కామెడీ, టైమింగ్ తో ఆకట్టుకుంది. ఇక రీసెంట్ టైమ్స్ లో సమంత కామెడీ టైమింగ్ కంప్లీట్ గా మారిపోయింది. తాజాగా ఇదే విషయంలో రానా సమంతను ప్రశ్నించాడు. ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ లో రానా స్టేజ్ పైకి సమంతను ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేయడంతోనే టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లారు. సిస్టర్ ఇన్ లా నుంచి ఈరోజు సిస్టర్ అయ్యారు అంటూ మా ట్లాడారు. ఆ తర్వాత అప్పటి సమంత ఏమ య్యారు ఆ కామెడీ చేసే సమంతా ఎక్కడ అని రానా అడిగారు. వెంటనే ఆ సమంత చేసే కామెడీ ఎప్పుడో అయిపోయింది అంటూ సమంత సమాధానం ఇచ్చింది. అలానే రానా నాయుడు సిరీస్ గురించి కూడా కొన్ని సెటైర్లు వేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం సిటా డెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో సమంత బిజీబిజీగా ఉంది.

Tags:    

Similar News