Samantha : రెమ్యూనరేషన్లో తేడా ఏంటి? : సమంత

Update: 2025-04-15 06:15 GMT

నటీ నటులకు ఇస్తున్న రెమ్యూనరేషన్ పై సమంత రుతుప్రభు స్పందించింది. కష్టానికి తగినట్టుగా పారితోషికం దక్కడం లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించానని తెలిపింది. నటీనటులందరూ ఒకేలా కష్టపడతారు కానీ, వారికి ఇచ్చే పారితోషికాల్లో మాత్రం వ్యత్యాసం ఉంటుందన్నారు. సమానమైన డిమాండ్ ఉన్న పాత్రలు చేసినప్పటికీ పారితోషికం విషయంలో తేడా స్పష్టంగా కనిపిస్తుందంటోంది. పరిశ్రమలో తనను ఇబ్బంది పెట్టే విషయాల్లో ఇదొకటని తెలిపింది. విషయంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నానని చెప్పింది. గత పరిస్థితులు తాను మార్చలేనని అన్నది. కాబట్టి తాను ప్రత్యక్షంగా కాకపోయినా ఈ విషయంపై పోరాడుతున్నానని చెప్పింది. అలాగని సమానంగా పారితోషికం ఇవ్వాలని కోరడం లేదన్నారు. కష్టాన్ని చూసి రెమ్యునరేషన్ ఇవ్వాలని తెలిపింది. 

Tags:    

Similar News