నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 రిలీజ్ తర్వాత వీకెండ్ వరకూ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. నాలుగు రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూపర్ హిట్ అనిపించుకుంది. అయితే ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఈ జోరు లేదు అనే చెప్పాలి. తమిళ్ లో కొంత వరకూ బెటర్ అనిపించుకున్నా కేరళ, కర్ణాటక నుంచి హిట్ 3కి అంత రెస్పాన్స్ ఏం రాలేదు. ఇటు వీక్ డేస్ లో కొంత స్లో అయింది. ఆంధ్రలో చాలా ఏరియాస్ లో ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే వచ్చే వారం సినిమాల ప్రభావం ఈ మూవీపై పడుతుంది అనుకోలేం. ఎందుకంటే హిట్ 3 అనేది సెపరేట్ జానర్ మూవీ కాబట్టి. దీనికి సెపరేట్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఆ ప్రభావం అంతగా కనిపించకపోవచ్చు అనుకోవచ్చు.
ఇక నాని కెరీర్ లోనే కాక టాలీవుడ్ లోనే మోస్ట్ వయొలెంట్ మూవీగా ఈ చిత్రాన్ని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ మొత్తం రక్తంప్రవాహం కనిపిస్తుంది. నాని బలం ఫ్యామిలీ ఆడియన్స్. వారికి దూరంగా ఈ చిత్రం కనిపిస్తుంది. అలాగే పిల్లలు చూడ్డానికి కూడా లేదు. ఈ కారణంగానే వసూళ్లు కొంత మందగించాయి అనుకోవచ్చు. అదే టైమ్ లో విపరీతమైన బూతులు యధేచ్ఛగా వాడేశారు. అడల్ట్స్ అయినా చాలామంది మహిళలు ఆ పదాలను ఎంజాయ్ చేయలేకపోతున్నారు అనే చెప్పాలి. మొత్తంగా చాలా చోట్ల బ్రేక్ ఈవెన అయిన ఈ మూవీ ఇంకా కొన్ని చోట్ల కొన్నదానికి వచ్చిన వసూళ్లకు మధ్య వ్యత్యాసం కాస్త ఎక్కువగానే కనిపిస్తోందంటున్నారు. మరి నెక్ట్స్ వీక్ మూవీస్ ఎఫెక్ట్ పడకపోతే మెల్లగా ఆ కలెక్షన్స్ ను కూడా సాధించొచ్చు.