రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో దీక్షిత్ శెట్టి, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా గర్ల్ ఫ్రెండ్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై ధీరజ్ మొగిలి నేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా టీజర్ అలరించగా రిలీజ్ ఎప్పుడంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలైతే ఈ సినిమా ఈ సమ్మర్ రిలీజ్ అనుకున్నారు కానీ అవుట్ పుట్ మీద మేకర్స్ అంత సాటిస్ఫైడ్ గా లేరన్నట్టు టాక్ వచ్చింది. అందుకే సినిమాకు ఇంకాస్త మెరుగులు దిద్ది రిలీజ్ చేస్తారని టాక్. రిలీజ్ ఎప్పు డన్నది తెలియదు కానీ రష్మిక గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడొచ్చినా ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుందనే టాక్ ఉంది. రష్మిక కూడా సోలోగా చేసిన గర్ల్ ఫ్రెండ్ మీద చాలా హోప్స్ పెట్టుకుంది.