కమల్ హాసన్ తెలియని ఇండియన్ ఆడియన్స్ ఉండడు. 50యేళ్లుగా హీరోగా మెప్పిస్తూనే ఉన్నాడు. వరల్డ్ సినిమా హిస్టరీలోనే ఎవరూ చేయనన్ని ప్రయోగాలు చేశాడు. గెటప్పులు వేశాడు. వైవిధ్యమైన కథలతో మెస్మరైజ్ చేశాడు. క్లాసికల్ డ్యాన్స్ అయినా, మ్యూజిక్ అయినా అలాంటి పాత్ర చేయాల్సి వస్తే నేర్చుకుని మరీ చేసిన ఏకైక స్టార్.అందుకే ఆయన్ని తమిళ్ ప్రేక్షకులు ‘ఉలగ నాయకన్’ అనుకున్నారు. అంటే తెలుసు కదా.. యస్ లోక నాయకుడు. అయితే ఇకపై తనను ఇలా పిలవొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాడు కమల్ హాసన్.
‘ప్రేక్షకులు, సన్నిహితులు నన్ను ‘ఉలగ నాయకన్’ అన్నారు. కానీ సినిమా అనేది నా ఒక్కడి వల్ల అయ్యేది కాదు. లెక్కలేనంత మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కలిసి పని చేస్తేనే సినిమా రెడీ అవుతుంది. అందరిలాగానే నాకూ సినిమా అనేది నిత్య పాఠశాట. నేను నిత్య విద్యార్థిని. అందుకే ఇకపై దయచేసి నాకు వేరే ఏ బిరుదుల తగిలించొద్దు. కేవలం కమల్, కమల్ హాసన్, కే.హెచ్ (K.H )అనిమాత్రమే పిలిస్తే చాలు అంటూ ఓ లెటర్ విడుదల చేశాడు.’
ఇన్నేళ్ల తర్వాత కమల హాసన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలేంటో తెలియదు కానీ.. ఆయన చెప్పిన రీజన్స్ అన్నీ సహేతుకమైనవే అయినా.. కమల్ లాంటి యాక్టింగ్ జీనియస్ కు అలాంటి బిరుదు కరెక్టే అనేది మెజారిటీ ఆడియన్స్ ఒపీనియన్.
ఇవాళా రేపు ఒకట్రెండు సినిమాలు హిట్ కాగానే రకరకాల ట్యాగ్ లు తగిలించుకుని విర్ర వీగుతున్నారు. అలాంటిది కమల్ ఇన్నేళ్ల తర్వాత తనను లోక నాయకుడు అని పిలవొద్దు అనడం మాత్రం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.