మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ తో ప్యాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్ తర్వాత ఆచార్యతో రాజమౌళి శాపం తొలగించుకున్నాడు. ప్యాన్ ఇండియా రేంజ్ లో వచ్చిన ఇమేజ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లేందుకు శంకర్ తో సినిమాకు కమిట్ అయ్యాడు. బట్ ఈ మూవీకి ఆరంభం నుంచి అనేక సమస్యలు వచ్చాయి. ఏ దశలోనూ షూటింగ్ సజావుగా సాగలేదు. అప్డేట్స్ కోసం అడిగీ అడిగీ ఫ్యాన్స్ కూడా విసుగెత్తిపోయారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీ కోసం మధ్యలో మరో దర్శకుడిని తెచ్చి కూడా షూటింగ్ చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా రామ్ చరణ్ పార్ట్ పూర్తయింది. మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు శంకర్. బట్ శంకర్ గత చిత్రం భారతీయుడు 2 రిజల్ట్ చూసిన తర్వాత చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ పై పెద్దగా హోప్స్ పెట్టుకోవడం లేదు అంటారు.
ఇక గేమ్ ఛేంజర్ ను డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నారు. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కానీ.. దాదాపు ఆ డేట్ కన్ఫార్మ్. అయితే అదే రోజున గతంలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు నాగ చైతన్య, నితిన్. నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో వస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ తండేల్ తో పాటు నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వస్తోన్న రాబిన్ హుడ్ ఆ రోజునే రిలీజ్ అన్నారు. వీరి తర్వాతే చరణ్ వచ్చాడు.అయినా పెద్ద హీరో కాబట్టి వాళ్లేం మాట్లాడలేరు. అయితే చరణ్ వస్తున్నాడు కాబట్టి ఈ రెండు సినిమాలు పోస్ట్ పోన్ లేదా ప్రీ పోన్ అవుతాయనుకున్నారు. బట్ సిట్యుయేషన్ చూస్తోంటే ఆ హీరోలు తగ్గేదే లే అంటున్నారట. అంటే చరణ్ తో పోటీకి సై అంటున్నారు.
నితిన్, నాగ చైతన్య ఇద్దరూ ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నారు. ఇలాంటి టైమ్ లో రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోతో పోటీ పడితే వారికే రిస్క్ అనేది అనలిస్ట్ లు చెబుతున్నమాట. మరోవైపు ఇలాంటి టైమ్ లో హిట్ కొడితేనే వాళ్లు ఎంత కసిగా ఉన్నారో తెలుస్తుందనేది ఆ హీరోల వైపు నుంచి వినిపిస్తోన్న మాట. మొత్తంగా వరస చూస్తుంటే నాగ చైతన్య, నితిన్ కలిసి రామ్ చరణ్ ను ఫేస్ చేయడానికే రెడీ అవుతున్నారట. సో.. మరి బాక్సాఫీస్ క్రిస్మస్ తాత ఎవరికి ఎక్కువ గిఫ్ట్స్ ఇస్తాడో..