Surya : కంగువా ఫస్ట్ డే కలెక్షన్స్ తో రికార్డ్ సృష్టిస్తుందా..

Update: 2024-11-13 09:00 GMT

మరికొన్ని గంటల్లో సూర్య హీరోగా నటించిన కంగువా ప్రేక్షకుల ముదుకు రాబోతోంది. గురువారం నుంచి కంగువా సందడి మొదలవుతుంది. శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. కంగువాతో సూర్య కూడా ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. దిశా పటానీ ఫీమేల్ లీడ్ గా, బాబీ డియోల్ విలన్ గా నటించిన ఈ మూవీ వెయ్యేళ్ల క్రితం నాటి కథగా రూపొందింది. అలాగే ఈ కాలానికి సంబంధించిన కంటెంట్ కూడా చివర్లో ఉంటుందట. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని జ్ఙానవేల్ రాజా నిర్మించాడు.

కోలీవుడ్ లో ఈ మూవీపై ఇంకా ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీతో తను కూడా విజయ్, అజిత్ రేంజ్ లో ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తాననే నమ్మకంతో ఉన్నాడు సూర్య. ఇప్పటికైతే ఈ మూవీకి చేసిన ప్రమోషన్స్ వల్ల ఇతర భాషల్లో కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలున్నాయి. అందుకే కంగువా ఫస్ట్ డే 100 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందంటున్నారు. ఇండియాతో పాటు ఓవర్శీస్ లోకూడా కంగువాకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ మూవీ కంటెంట్ కంటే కూడా సూర్య ఇమేజ్ కు ఎక్కువ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కు తోడు ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఫస్ట్ 100 కోట్లు కొల్లగొట్టడం పెద్ద కష్టమేం కాదు అంటున్నారు. ఒకవేళ కంగువా సెంచరీ కొడితే సూర్య రేంజ్ కూడా మారిపోతుంది.

Tags:    

Similar News