రాంచరణ్ తేజ్, జాన్వీకపూర్ జంటగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న సినిమా పెద్ది. ఈ మూవీలో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యాందు లాంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ‘పెద్ది’ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి విశేషమైన స్పందన లభించగా, మ్యూజిక్ విషయంలో రెహమాన్ మ్యాజిక్ ఎలా ఉండబోతుం దో అనే ఉత్కంఠ నెలకొంది. సినిమాను వచ్చే ఏడాది మార్చి 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంవ త్సరం వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ సింగిల్ను విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. కానీ ఈ వార్త పై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ బజ్ చుట్టూ భారీ ఎగ్జిట్ మెంట్ అయితే నెలకొంది.