వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇన్నాళ్లు తనకు ఎదురు లేదు అనుకుంటూ కనిపించాడు. నోటికి ఏది వస్తే అది వాగడం.. ఎక్స్ ఖాతాలో ఇష్టం వచ్చిన పోస్ట్ లు పెట్టడం చేస్తూ అడ్డగోలుగా బిహేవ్ చేశాడు. ఇన్నాళ్లకు అతని అహంకారానికి అడ్డు కట్ట పడబోతోంది. త్వరలోనే రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వర్మ తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై ఇష్టం వచ్చిన పోస్ట్ లు పెట్టాడు. అసభ్యంగా కమెంట్స్ కూడా చేశాడు. వ్యూహం లాంటి మూవీస్ లో వారిని దారుణంగా కించ పరుస్తూ డైలాగ్స్ ఉన్నాయి. వీటిపై తాజాగా తెలుగు దేశం పార్టీ అభిమానులు కేస్ లు పెడుతున్నారు. ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు స్టేషన్ లో కేస్ నమోదైంది. మరోవైపు తుళ్లూరులో కూడా ఇదే విషయంపై కేస్ లు నమోదయ్యాయి. ఈ మేరకు పోలీస్ లు వర్మకు స్వయంగా వెళ్లి నోటీస్ లు కూడా అంద చేశారు.
త్వరలోనే ఆయన్ని అరెస్ట్ చేసి కోర్ట్ లో ప్రవేశ పెట్టబోతున్నారు. ఏదేమైనా సోషల్ మీడియా వేదికగా గతంలో ప్రతిపక్షంలో ఉన్న టిడిపి చంద్రబాబు, లోకేష్ లపై అనుచితంగా, వ్యక్తిగతంగా కించపరుస్తూ పోస్ట్ లు పెట్టిన వాళ్లందరినీ లోపల వేస్తున్న తరుణంలో వర్మను కూడా మూసేయబోతున్నారని తెలిసి టిడిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.