'కేజీఎఫ్' సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో యష్. రాకింగ్ స్టార్ అభిమానులు పిలుచుకునే యష్ కొత్త చిత్రం 'టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోస్ అప్స్'. పాన్ ఇండియా సినిమాగా భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఉగాది, గుడి పడ్వా, ఈద్ పండుగల సందర్భంగా తమ సినిమాను విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. కన్నడ, ఇంగ్లీషు భాషల్లో 'టాక్సిక్' సినిమాను నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ప్రాజెక్ట్ టాక్సిక్ ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అలాగే తెలుగుతో పాటుగా భారతీయ భాషల్లో కూడా అదే తేదీన విడుదల చేస్తారు. ఈ చిత్రానికి గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. వెంకట్ కె. నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.