Uttar Pradesh : యూపీ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..

Uttar Pradesh : బారాబంకీ జిల్లాలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై యాక్సిడెంట్‌లో 8 మంది మృత్యువాత పడ్డారు;

Update: 2022-07-25 09:02 GMT

Uttar Pradesh : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకీ జిల్లాలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై యాక్సిడెంట్‌లో 8 మంది మృత్యువాత పడ్డారు. మరో 16 మందికి గాయాలయ్యాయి. పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ వేపై ...ఆగి ఉన్న డబుల్‌ డెక్కర్ బస్సును...బిహార్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న మరో డబుల్ డెక్కర్‌ బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో ఘోర ప్రమాదం సంభవించింది.

అటు ఎక్స్‌ప్రెస్‌ హైవే వద్ద సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు... క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. తీవ్రంగా గాయపడినవారిని లఖ్​నవూలోని ట్రామా కేంద్రానికి తరలించినట్లు బారాబంకీ ఎస్పీ వెల్లడించారు. ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Tags:    

Similar News