Nandyala: నంద్యాలలో దారుణం.. ఐదేళ్ల బాలుడిని కాల్చి చంపిన దుండగులు..
Nandyala: నంద్యాల జిల్లా పాండురంగాపురం గ్రామంలో బాలుడి హత్య కలకలం సృష్టిస్తోంది.;
Nandyala: నంద్యాల జిల్లా పాండురంగాపురం గ్రామంలో బాలుడి హత్య కలకలం సృష్టిస్తోంది. ఐదేళ్ల లోపు బాలుడిని మినుము పొట్టులో వేసి కాల్చి చంపేశారు దుండగులు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే.. ఇదే గ్రామానికి చెందిన సూర్య అనే బాలుడు గత నెల 30వ తేదీని అంగన్వాడీ స్కూల్‌కు వెళ్లి తిరిగి రాలేదంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి మాధవి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డాగ్ స్వ్కాడ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ సమయంలో.... కాలిపోయిన బాలుడి మృతదేహం కనిపించింది. అయితే... ఇది తప్పిపోయిన సూర్యదా ? కాదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.