పెన్షన్‌ డబ్బుల కోసం చనిపోయిన తాతను ఫ్రిజ్‌లో దాచిన మనవడు

పెన్షన్‌ డబ్బుల కోసం చనిపోయిన తాతను ఫ్రిజ్‌లో దాచిన ఓ మనవడి కథ ఇది. పరకాలలోని పొరండ్ల కైలాసం కాంప్లెక్సులో తాతమనవడు మాత్రమే ఉంటారు.

Update: 2021-08-13 04:10 GMT

పెన్షన్‌ డబ్బుల కోసం చనిపోయిన తాతను ఫ్రిజ్‌లో దాచిన ఓ మనవడి కథ ఇది. పరకాలలోని పొరండ్ల కైలాసం కాంప్లెక్సులో తాతమనవడు మాత్రమే ఉంటారు. బాలయ్య రిటైర్డ్‌ టీచర్‌ కావడంతో నెలకు 40వేల రూపాయల పెన్షన్ డబ్బులు వస్తాయి. 90 ఏళ్ల వయసున్న బాలయ్య.. కదలలేని స్థితిలో మంచానికే పరిమితం అయ్యాడు. బాలయ్య బాగోగులన్నీ మనవడు నిఖిల్ చూసుకుంటుంటాడు. బయట నుంచి టిఫిన్లు, భోజనం తెచ్చి తాతకు ఇవ్వడమే నిఖిల్ పని. సడన్‌గా బాలయ్య చనిపోవడం, పెన్షన్‌ డబ్బులు ఇంకా అకౌంట్లో పడకపోవడంతో.. తన తాతను ఫ్రిజ్‌లో కుక్కేశాడు. తాత చనిపోయాడన్న విషయం బయటకు తెలిస్తే పెన్షన్‌ డబ్బులు రావని తెలుసు. దీంతో డబ్బులు అకౌంట్లో పడేంత వరకు వెయిట్ చేశాడు.

తాతామనవడు ఉంటున్న ఇంట్లోంది దుర్వాసన వస్తుండడంతో.. ఓనర్‌ వచ్చి పరిశీలించాడు. నిఖిల్‌ను గట్టిగా నిలదీసే సరికి అంత్యక్రియలకు డబ్బులు లేక ఫ్రిజ్‌లో దాచినట్టు చెప్పాడు. కాని, అప్పటికే పెన్షన్ డబ్బులు అకౌంట్లో పడ్డాయి. అయినప్పటికీ.. బాలయ్య చనిపోయిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. నిఖిల్‌ జల్సాలకు అలవాటు పడడంతో.. బాలయ్య చనిపోయిన విషయం తెలిస్తే ఇక పెన్షన్‌ రాదని అనుమానించాడు. ఆ కారణంతోనే ఫ్రిజ్‌లో దాచాడని పోలీసులు చెబుతున్నారు. నిఖిల్‌ తల్లిదండ్రులు చనిపోవడం, బాలయ్య భార్య సైతం కరోనాతో మృతిచెందడంతో.. పరకాలలో తాతామనవడు మాత్రమే ఉంటున్నారు. ఇన్నాళ్లు తాత పెన్షన్‌ డబ్బులతో జల్సాలు చేసుకుంటూ తిరిగాడు నిఖిల్.

Tags:    

Similar News