హనుమకొండలో దారుణం జరిగింది. మైనర్ బాలికను నమ్మించి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. కాకతీయ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి సమీపంలో ఉన్న ప్లంబర్ పనిచేసే ఓ యువకుడిని బాలిక తన తల్లికి ఫోన్ చేయమని అడిగింది. ఫోన్ చేస్తానని ఇంట్లోకి పిలిచి నమ్మించి బాలిక పై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. బలవంతంగా బట్టలు విప్పి అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. బాలిక తీవ్రంగా ప్రతిఘటించి అతని చేతిని కొరకడంతో బాలికను వదిలేశాడు. ఇంట్లోనుంచి బయటకు పరుగెత్తి తన తల్లికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.. తల్లి ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేసి యువకుడిని రిమాండ్ తరలించామని కేయూ పోలిస్ అధికారి తెలిపారు..