Nizamabad: నిజామాబాద్ జిల్లా గ్రామీణ బ్యాంకులో చోరీ.. భారీగా నగదు, పెద్దమొత్తంలో నగలు..
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో దొంగలు హల్‌చల్ చేశారు. గత రాత్రి బ్యాంకులోకి ప్రవేశించి నగదు, నగలు ఊడ్చేశారు.;
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో దొంగలు హల్‌చల్ చేశారు. గత రాత్రి బ్యాంకులోకి ప్రవేశించి నగదు, నగలు ఊడ్చేశారు. మెండోరా మండలం బుస్సాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఈ చోరీ ఘటన జరిగింది. ముందుగా BSNLఆఫీసులోకి ప్రవేశించిన దొంగలు.. అందులో నుండి బ్యాంక్‌పైకి ఎక్కి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. గ్యాస్‌కట్టర్‌తో షెట్టర్ తాళాలను తొలగించి బ్యాంకులోకి ప్రవేశించారు. బ్యాంక్ లోని లాకర్లను కూడా గ్యాస్‌కట్టర్‌తో ఓపెన్ చేశారు.
ఈ క్రమంలో లాకర్‌లోని కొంత డబ్బు, పత్రాలు బూడిదయ్యాయి. పెద్దమొత్తంలో డబ్బు, నగలను దొంగలు ఊడ్చేశారు. ఈ రోజు బ్యాంక్ తెరవగానే దొంగతనం వెలుగుచూసింది. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీపీ నాగరాజు బ్యాంకును సందర్శించారు. ఏడు లక్షల నగదు, రెండు కోట్లకు పైగా విలువగల నగలు ఎత్తుకెళ్లినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు.