పబ్జీ ఆడనివ్వలేదని ఉరివేసుకొని బాలుడు ఆత్మహత్య
పబ్జీకి మరో బాలుడు బలయ్యాడు. హైదరాబాద్ కూకట్ పల్లి పరిధిలోని సంగీత్ నగర్ లో ఈ విషాదం చోటుచేసుకుంది.;
పబ్జీకి మరో బాలుడు బలయ్యాడు. హైదరాబాద్ కూకట్ పల్లి పరిధిలోని సంగీత్ నగర్ లో ఈ విషాదం చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న మణికంట ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పబ్జి గేమ్ ఆడొద్దని బాలుడిని తల్లిదండ్రులు మందలించడంతో.. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.