కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన బాలుడు
కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన బాలుడు అపస్మారక స్థితికి చేరడంతో కాకినాడ ఆసుపత్రికి తరలించారు.;
కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన బాలుడు అపస్మారక స్థితికి చేరడంతో కాకినాడ ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోటి 18 ఎకరాల కాలనీలో ఈ ఘటన జరిగింది. కోడిపిల్లలకు మేత కోసం పంటపోలాల వైపు వెళ్లిన 12 ఏళ్ల జోసెఫ్.. అక్కడ కనబడిన పురుగుల మందును కూల్ డ్రింక్ అనుకుని తాగేశాడు. దీంతో అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని స్థానికులు రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని బంధువులు తెలిపారు.