Jubliee Hills : ఆ ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించండని ఫిర్యాదు
Jubliee Hills : జూబ్లిహిల్స్ అత్యాచార ఘటనకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఫిర్యాదు నమోదైంది.;
Jubliee Hills : జూబ్లిహిల్స్ అత్యాచార ఘటనకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఉంచారంటూ మైనర్ బాలిక తల్లిదండ్రులు మహిళా భద్రతా విభాగంలో ఫిర్యాదు చేశారు. బాలికతో ఐదుగురు కలిసి అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలు, ఆమె మెడపై గాయమైన ఫోటోలను ఇన్‌స్టాలో ఉంచారని, వాటిని తొలగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసును హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు బదిలీ చేశారు. జూవైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. బాలిక దృశ్యాలను తొలగించాలని ఇన్‌స్టా ఖాతాదారులకు నోటీసులు ఇచ్చారు.