Hyderabad : క్యాబ్ డ్రైవర్ అజాగ్రత్త.. చిన్నారి దుర్మరణం
Hyderabad : హైదరాబాద్ నాచారం పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. క్యాబ్ డ్రైవర్ అజాగ్రత్తగా రివర్స్‌లో నడపడంతో...ఓ చిన్నారి దుర్మణం చెందింది.;
Hyderabad : హైదరాబాద్ నాచారం పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. క్యాబ్ డ్రైవర్ అజాగ్రత్తగా రివర్స్‌లో నడపడంతో...ఓ చిన్నారి దుర్మణం చెందింది. రాఘవేంద్రనగర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ కాలనీలోని ఓ ఇంట్లో రవళి వాచ్ విమెన్‌గా పనిచేస్తోంది. ఆమె కూతురు సిరి ఆడుకోవడానికి బయటికి రాగా... అప్పుడే అక్కడికి చేరుకున్న క్యాబ్ వెహికిల్‌ను రివర్స్ చేస్తున్నాడు డ్రైవర్. కారు వెనుక చిన్నారి ఉందని తెలియక..నిర్లక్ష్యంగా రివర్స్ డ్రైవింగ్ చేశాడు. దీంతో చిన్నారి సిరి కారు టైర్ కింద పడి చనిపోయింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో... డ్రైవర్‌ను అదుపులో తీసుకున్నారు పోలీసులు.