East Godavari: పిఠాపురంలో యువతి అదృశ్యం.. ఆటో డ్రైవర్‌పై అనుమానం అంటూ చివరి మెసేజ్..
East Godavari: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో యువతి అదృశ్యం కలకలం రేపుతోంది.;
East Godavari: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో యువతి అదృశ్యం కలకలం రేపుతోంది. కాకినాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న తవ్వా హారిక.. నిన్న కాలేజ్‌కి హాల్ టికెట్ తెచ్చుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఆటో డ్రైవర్‌పై అనుమానంగా ఉందని.. హారికి తన స్నేహితులకు చివరిగా మెసేజ్ చేయడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆటో డ్రైవర్‌లను పోలీసులు విచారిస్తున్నారు. సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.