GHMC ప్రధాన కార్యాలయం వద్ద ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం
GHMC ప్రధాన కార్యాలయం ముందు కలకలం రేగింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని అకారణంగా తొలగించారంటూ ఆ కుటుంబం పెట్రోల్ పొసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది.;
GHMC ప్రధాన కార్యాలయం ముందు కలకలం రేగింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని అకారణంగా తొలగించారంటూ ఆ కుటుంబం పెట్రోల్ పొసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అబిడ్స్ సర్కిల్-14లో.. 15 ఏళ్లుగా శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు రమేష్ యాదవ్ అనే వ్యక్తి. అయితే.. అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఉమాగౌరీ.. ప్రతి నెలా డబ్బులు ఇవ్వాలని వేధించేదని.. డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతోనే ఉద్యోగం నుంచి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వచ్చిన బాధిత కుటుంబం.. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.