డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్ టోలిచౌకిలో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు;
హైదరాబాద్ టోలిచౌకిలో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మహ్మద్ ఇర్ఫాన్‌ను రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. పక్కా సమాచారంతో మహ్మద్ ఇర్ఫాన్ వద్దకు మఫ్టీలో వెళ్లాడు ఎస్‌ఐ. అయితే ఎస్‌ఐని వినియోగదారుడు అనుకొని హెరాయిన్ ప్యాకెట్ ఇచ్చాడు. దీంతో అక్కడికక్కడే మహ్మద్ ఇర్ఫాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 8.56 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి చెందిన గయాజ్ నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దీంతో ఇర్ఫాన్, గయాజ్‌పై నార్కొటిక్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం గయాజ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.