Hyderabad : పెళ్లి చేసుకోవాలంటూ యువతికి వేధింపులు.. నిరాకరించడంతో 18 సార్లు కత్తితో పొడిచి..!
Hyderabad : హైదరాబాద్ ఎల్బీనగర్‌లో దారుణ ఘటన జరిగింది. హస్తినాపురంలో ఉండే శిరీష అనే యువతిపై బస్వరాజ్ అనే వ్యక్తి కత్తితో దాడి దాడి చేశారు.;
Hyderabad : హైదరాబాద్ ఎల్బీనగర్‌లో దారుణ ఘటన జరిగింది. హస్తినాపురంలో ఉండే శిరీష అనే యువతిపై బస్వరాజ్ అనే వ్యక్తి కత్తితో దాడి దాడి చేశారు. 18 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. యువతి పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు శిరీష స్వగ్రామం వికారాబాద్ జిల్లా చంద్రకల్. తనను పెళ్లి చేసుకోవాలంటూ కొంతకాలంగా శిరీషను బస్వరాజ్ వేధిస్తున్నాడు. పెళ్లికి నిరాకరించడంతో శిరీషపై బస్వరాజ్ కత్తితో దాడి చేశాడు. నిందితుడు బస్వరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.